Wednesday, 23 September 2026
  • Home  
  • నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి — కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్
- కడప

నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి — కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్

నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి — కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21, కడప: కడప చరిత్రతో ముడిపడి ఉన్న నేక్‌నామ్ ఖాన్ గారి జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి (DRO)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ, 17వ శతాబ్దంలో కుతుబ్‌షాహీ కాలంలో నేక్‌నామ్ ఖాన్ కడప పట్టణ విస్తరణకు విశేష కృషి చేశారని తెలిపారు. కడపలో విద్యా, కళా అభివృద్ధితో పాటు సామాజికంగా నగర ప్రగతికి ఆయన చేసిన సేవలు చరిత్రలో గుర్తుండిపోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన కడపకు చేసిన సేవల కారణంగానే “నేక్‌నమాబాద్” అనే పేరు కడప చరిత్రలో ప్రస్తావించబడుతుందని తెలిపారు. మరమ్మతుల సమయంలో తొలగించిన “నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం” నామఫలకాన్ని వెంటనే పునఃస్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల అనుమతితో నామఫలకాన్ని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కడప నగరంలో ఒక పార్కు, గార్డెన్, సర్కిల్ లేదా తగిన ప్రజా ప్రదేశానికి నేక్‌నామ్ ఖాన్ పేరు పెట్టి ఆయన సేవలను శాశ్వతంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను సమర్పించిన వినతిపత్రంపై DRO సానుకూలంగా స్పందించారని గౌస్ పీర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన బాధ్యతను కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC)కి అప్పగించడంతో పాటు, KMC కమిషనర్‌తో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, డివిజన్ ఇంచార్జిలు మహబూబ్ భాషా, సిద్ధిక్, సయ్యద్ అన్వర్, మురాద్, గఫార్, ఆరిఫ్, సర్దార్ భాష, సుబ్రహ్మణ్యం, హాజీ భాయ్, గౌరీ దేవి, హమీదా ఖానం తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి

కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి

— కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 21, కడప:

కడప చరిత్రతో ముడిపడి ఉన్న నేక్‌నామ్ ఖాన్ గారి జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి (DRO)ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ, 17వ శతాబ్దంలో కుతుబ్‌షాహీ కాలంలో నేక్‌నామ్ ఖాన్ కడప పట్టణ విస్తరణకు విశేష కృషి చేశారని తెలిపారు. కడపలో విద్యా, కళా అభివృద్ధితో పాటు సామాజికంగా నగర ప్రగతికి ఆయన చేసిన సేవలు చరిత్రలో గుర్తుండిపోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన కడపకు చేసిన సేవల కారణంగానే “నేక్‌నమాబాద్” అనే పేరు కడప చరిత్రలో ప్రస్తావించబడుతుందని తెలిపారు.

మరమ్మతుల సమయంలో తొలగించిన “నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం” నామఫలకాన్ని వెంటనే పునఃస్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల అనుమతితో నామఫలకాన్ని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అదేవిధంగా కడప నగరంలో ఒక పార్కు, గార్డెన్, సర్కిల్ లేదా తగిన ప్రజా ప్రదేశానికి నేక్‌నామ్ ఖాన్ పేరు పెట్టి ఆయన సేవలను శాశ్వతంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తాను సమర్పించిన వినతిపత్రంపై DRO సానుకూలంగా స్పందించారని గౌస్ పీర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన బాధ్యతను కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC)కి అప్పగించడంతో పాటు, KMC కమిషనర్‌తో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, డివిజన్ ఇంచార్జిలు మహబూబ్ భాషా, సిద్ధిక్, సయ్యద్ అన్వర్, మురాద్, గఫార్, ఆరిఫ్, సర్దార్ భాష, సుబ్రహ్మణ్యం, హాజీ భాయ్, గౌరీ దేవి, హమీదా ఖానం తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.