జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS నెల్లూరు సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవుట్‌పోస్టులు, ట్రాఫిక్ కంట్రోల్ ఏర్పాట్ల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల బలోపేతానికి కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. క్రైమ్ స్పాట్లను గుర్తించి నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై పర్యవేక్షణ పెంచి, నిషేధిత కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ప్రజలకు భద్రతాభావం కలిగేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు.



