Wednesday, 5 August 2026
  • Home  
  • నెల్లూరు: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – కాకాణి

నెల్లూరు: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – కాకాణి పొదలకూరులో నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై అవగాహన సదస్సులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డీఎస్సీ–2025లో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నెల్లూరు: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – కాకాణి
పొదలకూరులో నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై అవగాహన సదస్సులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డీఎస్సీ–2025లో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.