నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షరీనా ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 100 మంది బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

నెల్లూరు : గూడూరు సర్కార్ దవాఖానాలో పేదలకు అండగా కృప సేవా ట్రస్ట్!