ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) జిల్లా అధ్యక్షుడు కోమటిగుంట్ల శివను నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి పరామర్శించారు. శనివారం జరిగిన కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన శివకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల చెక్కును ఆమె అందజేశారు. బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు : కత్తి దాడిలో గాయపడ్డ విద్యార్థి నేతకు మేకపాటి శాంతి కుమారి భరోసా!