నీవెప్పుడు జన్మిస్తావు?
—————————————
గంజాం భ్రమరాంబ
తిరుపతి
నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మించావు?
నీ తల్లిదండ్రులు
నీకు ఊపిరి పోసిన
నిమిషంలోనా….
లేదా
నీ మానవజన్మకు
అర్థం,పరమార్థం
వుందని తెలుసుకున్న
మరుక్షణంలోనా ….
రత్నాకరుడు
వాల్మీకిగా,
సిద్ధార్థుడు
బుద్ధుడుగా,
నరేంద్రుడు
వివేకానందుడుగా,
గాంధీజీ
మహాత్ముడుగా,
ఠాగూర్
కవీంద్రుడుగా,
అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాతగా,
సావిత్రి భాయి
తొలి ఉపాధ్యాయినిగా,
థెరెసా
విశ్వమాతగా,
ఇలా ఎందరెందరో…
పునః జన్మించడానికి
సంవత్సరాల కాలం
యుగాంతాల త్యాగం
జన్మాంతరాల
మేథో మధనం
వెరసి
వారి జన్మ సాఫల్యం
మరి
నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మిస్తావు?
అసలు నీవెవరో
నీవెప్పుడు గుర్తిస్తావు?
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918