ఖమ్మం: నగరంలోని నిర్మల్ హృదయ్ పాఠశాల అధినేత వంగ సాంబశివరెడ్డి భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్‌బీఐటీ, ఆర్జేసీ విద్యాసంస్థల అధినేత గుండాల కృష్ణ, బీఆర్‌ఎస్ నాయకులు బత్తుల మురళి, పగడాల నాగరాజు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం సాంబశివరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యారంగానికి సాంబశివరెడ్డి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. ఆయన మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి దుఃఖంలో భాగస్వాములమని తెలిపారు.



