Wednesday, 30 September 2026
  • Home  
  • నంద్యాల స్థానిక పోరులో ‘గోళ్ల రాజేష్’ సంచలన ప్రకటన.. 10 ప్రధాన హామీలతో మేనిఫెస్టో విడుదల
- నంద్యాల

నంద్యాల స్థానిక పోరులో ‘గోళ్ల రాజేష్’ సంచలన ప్రకటన.. 10 ప్రధాన హామీలతో మేనిఫెస్టో విడుదల

నంద్యాల :త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నంద్యాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి, నియోజకవర్గ ప్రజల ముందుకు తన సొంత ఎజెండా మరియు మేనిఫెస్టోను తీసుకువచ్చారు. “నా నియోజకవర్గం.. నా జెండా.. నా ఎజెండా” అనే నినాదంతో ఆయన ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గంలో అనేక రకాల సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించిన ఆయన, త్వరలో రాబోయే ఎన్నికలలో తమ ప్యానెల్ అభ్యర్థులను (మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు) గెలిపిస్తే పట్టణాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోళ్ల రాజేష్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: ఉచిత మున్సిపల్ గేట్ ఫీజులు: పేద ప్రజలకు భారం కాకుండా మున్సిపల్ గేట్ రుసుములను పూర్తిగా రద్దు చేసి, ఆ వ్యయాన్ని రాజేష్ సొంతంగా భరిస్తారు. ఇంటి పన్నుల తగ్గింపు: మున్సిపల్ కౌన్సిల్ ద్వారా నిర్ణయం తీసుకుని, పేద, మధ్యతరగతి వర్గాల కోసం పట్టణ పరిధిలో ఇంటి పన్నులను తగ్గిస్తారు. ప్రజా గౌరవం – మూత్రశాలలు: పట్టణంలోని ప్రతి ఒక్కరి మానప్రాణాలకు, గౌరవానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి వార్డులో ప్రత్యేక మూత్రశాలల నిర్మాణం. రూ.1 కే కడుపు నిండా భోజనం: ప్రతి వార్డులో రూపాయికే చపాతీ, కర్రీ, పప్పులతో కూడిన రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం లభించేలా ఏర్పాటు. స్థానిక యువతకు ఉద్యోగాలు: యువతీ యువకుల కోసం నంద్యాల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. సొంత నిధులతో వార్డుల అభివృద్ధి: వార్డుల్లోని డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీరు, రోడ్ల నిర్మాణ పనులను మున్సిపాలిటీ నిధులతో పాటు సొంత ఖర్చులతో పూర్తి చేస్తారు. ఉచిత పార్కింగ్ & సెక్యూరిటీ: మున్సిపల్ స్థలాల్లో ప్రజల వాహనాల కోసం ప్రైవేట్ సెక్యూరిటీ రక్షణతో ఉచిత పార్కింగ్ సదుపాయం. వడ్డీ లేని రుణాలు: అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు ప్రభుత్వ సహకారంతో పాటు వ్యక్తిగత నిధులతో వడ్డీ లేని రుణాల విస్తరణ. వివాహాలకు ఆర్థిక సాయం: కులమతాలకు అతీతంగా పేద కుటుంబాలలోని యువతీ యువకుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం: చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, నూతన విధానాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే నంద్యాల పట్టణ రూపురేఖలు మారుస్తామని గోళ్ల రాజేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నంద్యాల :త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నంద్యాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి, నియోజకవర్గ ప్రజల ముందుకు తన సొంత ఎజెండా మరియు మేనిఫెస్టోను తీసుకువచ్చారు. “నా నియోజకవర్గం.. నా జెండా.. నా ఎజెండా” అనే నినాదంతో ఆయన ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు.
గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గంలో అనేక రకాల సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించిన ఆయన, త్వరలో రాబోయే ఎన్నికలలో తమ ప్యానెల్ అభ్యర్థులను (మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు) గెలిపిస్తే పట్టణాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గోళ్ల రాజేష్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
ఉచిత మున్సిపల్ గేట్ ఫీజులు: పేద ప్రజలకు భారం కాకుండా మున్సిపల్ గేట్ రుసుములను పూర్తిగా రద్దు చేసి, ఆ వ్యయాన్ని రాజేష్ సొంతంగా భరిస్తారు.
ఇంటి పన్నుల తగ్గింపు: మున్సిపల్ కౌన్సిల్ ద్వారా నిర్ణయం తీసుకుని, పేద, మధ్యతరగతి వర్గాల కోసం పట్టణ పరిధిలో ఇంటి పన్నులను తగ్గిస్తారు.
ప్రజా గౌరవం – మూత్రశాలలు: పట్టణంలోని ప్రతి ఒక్కరి మానప్రాణాలకు, గౌరవానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి వార్డులో ప్రత్యేక మూత్రశాలల నిర్మాణం.
రూ.1 కే కడుపు నిండా భోజనం: ప్రతి వార్డులో రూపాయికే చపాతీ, కర్రీ, పప్పులతో కూడిన రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం లభించేలా ఏర్పాటు.
స్థానిక యువతకు ఉద్యోగాలు: యువతీ యువకుల కోసం నంద్యాల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
సొంత నిధులతో వార్డుల అభివృద్ధి: వార్డుల్లోని డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీరు, రోడ్ల నిర్మాణ పనులను మున్సిపాలిటీ నిధులతో పాటు సొంత ఖర్చులతో పూర్తి చేస్తారు.
ఉచిత పార్కింగ్ & సెక్యూరిటీ: మున్సిపల్ స్థలాల్లో ప్రజల వాహనాల కోసం ప్రైవేట్ సెక్యూరిటీ రక్షణతో ఉచిత పార్కింగ్ సదుపాయం.
వడ్డీ లేని రుణాలు: అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు ప్రభుత్వ సహకారంతో పాటు వ్యక్తిగత నిధులతో వడ్డీ లేని రుణాల విస్తరణ.
వివాహాలకు ఆర్థిక సాయం: కులమతాలకు అతీతంగా పేద కుటుంబాలలోని యువతీ యువకుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం: చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, నూతన విధానాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారు.
తమ అభ్యర్థులను గెలిపిస్తే నంద్యాల పట్టణ రూపురేఖలు మారుస్తామని గోళ్ల రాజేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.