Wednesday, 16 September 2026
  • Home  
  • ధరల పెంపుపై సీపీఎం వినూత్న నిరసన: కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక!
- నంద్యాల

ధరల పెంపుపై సీపీఎం వినూత్న నిరసన: కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక!

నంద్యాల: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ విమర్శించారు. నిత్యావసరాల ధరల పెంపునకు నిరసనగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌక్ సెంటర్‌లో వినూత్న నిరసన చేపట్టారు. నాయకులు మెడలో ఉల్లిగడ్డలు, మిరపకాయల దండలు వేసుకుని, నిత్యావసర సరుకులను ముందర ఉంచి నిరసన తెలిపాయి. కందిపప్పు, నూనె, ఉల్లి, చక్కెర, బియ్యం ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పుల్లా నరసింహ, మహ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, తోట మద్దులు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ విమర్శించారు. నిత్యావసరాల ధరల పెంపునకు నిరసనగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌక్ సెంటర్‌లో వినూత్న నిరసన చేపట్టారు.
నాయకులు మెడలో ఉల్లిగడ్డలు, మిరపకాయల దండలు వేసుకుని, నిత్యావసర సరుకులను ముందర ఉంచి నిరసన తెలిపాయి. కందిపప్పు, నూనె, ఉల్లి, చక్కెర, బియ్యం ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పుల్లా నరసింహ, మహ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, తోట మద్దులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.