Tuesday, 8 September 2026
  • Home  
  • ధనేశ్వర్ ఆలయ కలశ స్థాపన మహోత్సవం
- నిర్మల్

ధనేశ్వర్ ఆలయ కలశ స్థాపన మహోత్సవం

కుబీర్, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్,07: ధనేశ్వర్ ఆలయ కలశ స్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన మంగళవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11:15 గంటలకు కలశ స్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. కలశ స్థాపన అనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులు, గ్రామ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

కుబీర్, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్,07: ధనేశ్వర్ ఆలయ కలశ స్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన మంగళవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11:15 గంటలకు కలశ స్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు.
కలశ స్థాపన అనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులు, గ్రామ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.