Friday, 10 July 2026
  • Home  
  • ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
- తిరుపతి

ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, వాల్ పోస్టర్లను నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, కూటమి నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ జులై 17 నుండి జులై 29 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ప్రకటించారు. పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలలో ధ్వజారోహణము, ద్రౌపతీ కళ్యాణము, అర్జున తపస్సు, అగ్నిగుండ ప్రవేశము వంటి ఘట్టాలు ఎంతో విశేషమైనవని పేర్కొన్నారు. ఈ పవిత్ర మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.