దుత్తలూరులోని SRI SIDHARTHA HIGH SCHOOLలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



