Sunday, 16 August 2026
  • Home  
  • ఎల్‌ఆర్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎల్‌ఆర్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని ఎల్‌ఆర్ పల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎల్‌ఆర్ పల్లి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం  మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా నాయకులు శివప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, దేశభక్తి పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్‌ఆర్ పల్లి యువత, స్థానికులు, పలువురు నాయకులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని ఎల్‌ఆర్ పల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎల్‌ఆర్ పల్లి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం  మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా నాయకులు శివప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, దేశభక్తి పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎల్‌ఆర్ పల్లి యువత, స్థానికులు, పలువురు నాయకులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.