దుత్తలూరు మండలంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తురకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తురకపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, యేసు, బాబు, వెంకటరమణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

దుత్తలూరు విస్తృత సమావేశంలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తురకపల్లి గ్రామస్తులు