శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఐదవ రోజు మంగళవారం దుత్తలూరు శ్రీకృష్ణ మండప ప్రాంగణంలో భగవద్గీత జ్ఞాన పరీక్ష పోటీలు నిర్వహించారు. ప్రబోధ సేవా సమితి దుత్తలూరు శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన 68 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రథమ బహుమతి రూ.3,000, ద్వితీయ బహుమతి రూ.2,500, తృతీయ బహుమతి రూ.1,500గా నిర్ణయించారు. ఈనెల 11న శుక్రవారం జరిగే ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే ప్రతి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



