పామూరు, సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి): విజయవాడ పట్టణంలోని కుమ్మరిపాలెం సెంటర్ వద్ద కొట్టేటి కోటయ్య వీధిలో దారా ఏసుబాబు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన స్నేహితులు కేక్ కట్ చేసి, ఏసుబాబుతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని, ఆయనతో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనం అందించారు. ఈ సందర్భంగా ఏసుబాబు సేవలు, స్నేహపూర్వక స్వభావాన్ని స్మరించుకుంటూ స్నేహితులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొన్నారు.

దారా ఏసుబాబుకు ఘనంగా నివాళులు