నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిని పుట్టుపల్లె గ్రామానికి చెందిన దళిత కుటుంబాల వ్యవసాయ విద్యుత్ మీటర్లను తొలగించేందుకు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నంద్యాల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్,సీపీఐ మహానంది మండల కార్యదర్శి సామెలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.రాజు ఆధ్వర్యంలో నంద్యాల డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యంకు పుట్టుపల్లె గ్రామ దళితులు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పుట్టుపల్లె గ్రామ దళితులు గత నాలుగు దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వ భూములను నమ్ముకుని, సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.అయితే కోర్టు ఆదేశాల పేరుతో దళితుల భూముల్లో ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం అత్యంత విచారకరమని,నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలోని వివాదాలకు,దళితుల భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.విద్యుత్ అధికారులు ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వ రెవెన్యూ,అటవీ శాఖ అధికారులే వివరణ ఇచ్చుకోవాలి తప్ప,పేద దళితులకు ఎలాంటి సంబంధం లేదని, వారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని,తాము వాడుకుంటున్న వ్యవసాయ విద్యుత్ మీటర్ల బిల్లులను దళితులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా కచ్చితంగా చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.నాలుగు దశాబ్దాలుగా ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్న పేద దళితులను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయవద్దని,విద్యుత్ మీటర్ల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహానంది కార్యదర్శి లక్ష్మణ్,సిపిఐ మండల సహాయ కార్యదర్శి శ్రీనివాసులు,గ్రామ రైతులుబల రాముడు,బాలరాజు,గాబ్రేలు,హుసేని,జయ్యన్న, నరసింహులు,నాగ శేసుడులు పాల్గొన్నారు.

దళితుల విద్యుత్ మీటర్ల తొలగింపు నోటీసులను ఉపసంహరించుకోవాలి… సీపీఐ నాయకుల డిమాండ్.