Sunday, 26 July 2026
  • Home  
  • దర్గాను మరింత అభివృద్ధి చేస్తాం..వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దర్గాను మరింత అభివృద్ధి చేస్తాం..వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్!

నెల్లూరు పవిత్ర బారా షహీద్ దర్గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. నెల్లూరు: కులాలకు అతీతంగా, మత సామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గాను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పవిత్ర బారా షాహీద్ దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి దర్శించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడాలని, అభివృద్ధి చెందాలని ఆ అల్లాను కోరుకున్నట్లు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు…2014 ముందు దర్గాను దర్శించిన వారు రొట్టెల పండగ సందర్భంగా నాలుగు లక్షలు ఉండేవారని, నేడు 18 లక్షలకు చేరుకునిందని ఆయన తెలిపారు.కారణం కేవలం మౌలిక వసతులు కల్పనతో పాటు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ , స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎంత ఉన్నదని ఆయన తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరించి సరైన వసతులు కల్పించారని తెలిపారు. రోడ్లు ఉంచడంతోపాటు భక్తులకు అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం త్రాగునీటి వసతి అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారన్నారు.వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కృషితో కసుమూరు దర్గా వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు. పారాషహీద్ దర్గా నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసుల కు ఎంతో గర్వకారణమని అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం అని ఆయన కొనియాడారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… బారా షాహీద్ దర్గాలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించనున్నామని, ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే వాటిపై విశదీకరించి, రానున్న రోజుల్లో వాటిని తిరిగి జరగనీయకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.దర్గా ప్రాంగణం చాలా చిన్నదిగా ఉన్నదని, దానిని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాత్రి జరిగిన గంధమహోత్సవం కార్యక్రమంలో లక్షల మంది పాల్గొన్నారు అని ఆయన తెలిపారు. భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ పోలీసులు అప్రమత్తతతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అంతేకాకుండా తప్పి పోయిన వారిని వారి సంబంధీకులకు సాంకేతికతను ఉపయోగించి అప్పజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా చైర్మన్ మునీర్ అహ్మద్, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు పవిత్ర బారా షహీద్ దర్గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.

నెల్లూరు: కులాలకు అతీతంగా, మత సామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గాను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పవిత్ర బారా షాహీద్ దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి దర్శించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడాలని, అభివృద్ధి చెందాలని ఆ అల్లాను కోరుకున్నట్లు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు…2014 ముందు దర్గాను దర్శించిన వారు రొట్టెల పండగ సందర్భంగా నాలుగు లక్షలు ఉండేవారని, నేడు 18 లక్షలకు చేరుకునిందని ఆయన తెలిపారు.కారణం కేవలం మౌలిక వసతులు కల్పనతో పాటు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ , స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎంత ఉన్నదని ఆయన తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరించి సరైన వసతులు కల్పించారని తెలిపారు. రోడ్లు ఉంచడంతోపాటు భక్తులకు అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం త్రాగునీటి వసతి అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారన్నారు.వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కృషితో కసుమూరు దర్గా వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు. పారాషహీద్ దర్గా నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసుల కు ఎంతో గర్వకారణమని అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం అని ఆయన కొనియాడారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… బారా షాహీద్ దర్గాలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించనున్నామని, ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే వాటిపై విశదీకరించి, రానున్న రోజుల్లో వాటిని తిరిగి జరగనీయకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.దర్గా ప్రాంగణం చాలా చిన్నదిగా ఉన్నదని, దానిని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాత్రి జరిగిన గంధమహోత్సవం కార్యక్రమంలో లక్షల మంది పాల్గొన్నారు అని ఆయన తెలిపారు. భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ పోలీసులు అప్రమత్తతతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అంతేకాకుండా తప్పి పోయిన వారిని వారి సంబంధీకులకు సాంకేతికతను ఉపయోగించి అప్పజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా చైర్మన్ మునీర్ అహ్మద్, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.