Friday, 7 August 2026
  • Home  
  • దండాయుధపాణికి చెవిరెడ్డి కుటుంబం సారె
- తిరుపతి

దండాయుధపాణికి చెవిరెడ్డి కుటుంబం సారె

తిరుచానూరు, ఆగస్టు 7 పున్నమి ప్రతినిధి ఆడి కృత్తిక మహోత్సవం సందర్భంగా తిరుపతి రూరల్ మండలంలోని తణపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామివారికి చెవిరెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి ఆడి కృత్తిక సందర్భంగా సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన తల్లి లక్ష్మీ, సోదరుడు హర్షిత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు పద్మగిరి కొండకు చేరుకోగా ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, హేమంత్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించారు. వేదమంత్రాల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి కుటుంబ సభ్యులను సత్కరించారు.

తిరుచానూరు, ఆగస్టు 7 పున్నమి ప్రతినిధి

ఆడి కృత్తిక మహోత్సవం సందర్భంగా తిరుపతి రూరల్ మండలంలోని తణపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామివారికి చెవిరెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి ఆడి కృత్తిక సందర్భంగా సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన తల్లి లక్ష్మీ, సోదరుడు హర్షిత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు పద్మగిరి కొండకు చేరుకోగా ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, హేమంత్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించారు. వేదమంత్రాల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి కుటుంబ సభ్యులను సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.