పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 25
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుపతి తీర్థకట్ట వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీ కే రూపేంద్ర నాయుడు గారి సహకారంతో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రేమతో అన్నప్రసాదాన్ని పంపిణీ చేసి ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తపసి మురళి రెడ్డి మాట్లాడుతూ, తొలి ఏకాదశి వంటి పవిత్రమైన రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభసూచకమని, భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని, అదే స్ఫూర్తితో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సామాజిక సేవలో పాత్రికేయులు కూడా ముందుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలన్నదే ప్రెస్ క్లబ్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గొడ్డిండ్ల, ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు పొన్నా రవికుమార్, రమేష్ కుమార్, మధుసూదన్, నాగబాల, గౌరవాధ్యక్షులు సుకుమార్ రాజు, అనిల్ మరియు ఆలయ ధర్మకర్త వినోద్ రాయల్ అభిసారికతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు మరియు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.


