దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వినాయక చవితి వేడుకలను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాన్ని మూడో రోజు ప్రత్యేకంగా అలంకరించి, పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు నూతలపాటి హజరత్ తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



