పెదబయలు: తారాబు జలపాతం అభివృద్ధికి రూ.5 కోట్ల ఎంపీ నిధులతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అరకు ఎంపీ డా. గుమ్మ తనూజారాణి తెలిపారు. గురువారం పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి జలపాతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకుల సౌకర్యార్థం గాజు వంతెన, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్, పార్కింగ్, తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు, వాచ్‌టవర్, నడక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, చెత్త నిర్వహణ సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహజత్వాన్ని కాపాడుతూ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జర్సింగి సూర్యనారాయణ, చెట్టి వినయ్, జడ్పీటీసీ సభ్యుడు కూడా బొంజుబాబు, వొంటుభు సామ్యూల్, సింహాచలం, గంప సూరయ్య, కాతారీ సురేష్‌కుమార్, పాడి రమేష్, చెండా రవిశంకర్, టి.వెంకటరావు, కోర్ర రాజు, భాగ్యవతి, జర్సింగి బలంనాయుడు, గంగాభవాని, సూర్యనారాయణరావు, వంతల ఆనందరావు, జెండా పాపారావు, గొల్లూరి సన్యాసి, సమర్థి సూర్యం, కిముడు భాను తదితరులు పాల్గొన్నారు.



