Sunday, 6 September 2026
  • Home  
  • తాపీ కార్మిక సంఘం ఎన్నికల్లో సంకరి కృష్ణ, ఎలుగం శ్రీనివాసు,ల ఘనవిజయం.
- మంచిర్యాల

తాపీ కార్మిక సంఘం ఎన్నికల్లో సంకరి కృష్ణ, ఎలుగం శ్రీనివాసు,ల ఘనవిజయం.

గత 15 రోజులుగా ఎంతో ఉత్కంఠగా కొనసాగిన బెల్లంపల్లి పట్టణంలోని తాపీ కార్మిక సంఘం ఎన్నికలు, తాఫీ కార్మిక సంఘం భవనంలో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో సంకరి కృష్ణ అధ్యక్షునిగా ఎలుగం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ప్యానల్ గా పోటీ చేయగా, వీరి ప్రత్యర్థులుగా అధ్యక్షునిగా దాసరి శ్రీకాంత్, కార్యదర్సి గా, కాసర్ల పెద్దలు, పోటీ చేయగా, అధ్యక్షునిగా సంకర కృష్ణ తన సమీప ప్రత్యర్థి దాసరి శ్రీకాంత్, పై 58 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు, కార్యదర్శిగా పోటీ చేసిన ఎలుగం శ్రీనివాస్, తన సమీప ప్రత్యర్థి కాసర్ల పెద్దులు పై 106 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 621 ఓట్లకు గాను 556 ఓట్లు పోలు కాగా, అధ్యక్షులు సంకరి కృష్ణకు 293 ఓట్లు రాగా దాసరి శ్రీకాంత్ కు 235 ఓట్లు, చెల్లని ఓట్లు 28 పోలయ్యాయి, 58 ఓట్ల మెజారిటీతో సంకర కృష్ణ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్యదర్శిగా గెలుపొందిన ఎలుగం శ్రీనివాస్ కు 316 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాసర్ల పెద్దులు కు 210 వచ్చాయి, 30 ఓట్లు చెల్లకుండా పోగా, 106 ఓట్ల మెజార్టీతో ఎలుగం శ్రీనివాస్ గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమని, అప్పటి వరకే వాటిని మనసులో ఉంచుకోవాలని, అనంతరం అందరం కలిసి సంఘ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఓడిపోయిన వారితో అందరితో కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలోనే పూర్తి కమిటీని అందరి కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తామని అన్నారు. తమ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ అధ్యక్షులు ఆవుల కొమురయ్యకు, తాడిచెట్టు రామ్ కుమార్, తదితర సీనియర్ ప్రతినిధులకు, ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి, పోలీసు సిబ్బందికి, పత్రికా ప్రతినిధులకు, పేరుపేరు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సంఘ ప్రతినిధులు, గెలుపొందిన వారిని శాలువాలతో సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.