ఢిల్లీలో గృహ సహాయకురాలిని హత్య చేసిన కేసులో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మనీష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు మీనా హల్దర్ 16 ఏళ్లుగా ఆయన ఇంట్లో పనిచేస్తున్నారు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, అంత్యక్రియలు తొందరగా నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు. నిందితుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి, అనంతరం కత్తితో పొడిచినట్లు విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది.

ఢిల్లీలో గృహ సహాయకురాలి హత్య కేసులో వైద్యుడికి పోలీసు కస్టడీ