వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే ఎడిస్ ఈజిప్టీ దోమలు వేగంగా పెరుగుతాయని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి. రమణయ్య హెచ్చరించారు. ఈ దోమ పగటిపూట కుడుతుందని, శుభ్రమైన నిల్వ నీటిలోనే గుడ్లు పెడుతుందని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకుండా, కూలర్లు, పూలకుండీలు, పాత టైర్లను తరచూ శుభ్రం చేయాలని సూచించారు. జ్వరం, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

డెంగ్యూ దోమను తేలికగా తీసుకోవద్దు!