Tuesday, 2 June 2026
  • Home  
  • డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే – వైఎస్సార్సీపీ నిరసనలు, వినతిపత్రాల సమర్పణ
- News - ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం

డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే – వైఎస్సార్సీపీ నిరసనలు, వినతిపత్రాల సమర్పణ

– ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర స్దాయిలో ఉద్యమం : వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరిక డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించిన తర్వాత వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా – మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేశారు – అక్రమాలపై కలెక్టర్లరేట్ల వద్ద నిరసన తెలిపాం – లోకేష్ అసమర్థత వల్లే డీఎస్సీలో అవకతవకలు : ఆయన రాజీనామా చేసి తీరాల్సిందే కేకే రాజు డిమాండ్ – అక్రమాల కోసమే డీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు – స్పోర్ట్స్ కోటా జీవోల్ని మార్చి అర్హుల్ని ముంచారు – ఏ అర్హతతో లోకేష్ విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారు? – లోకేష్ ను తప్పించాలి, సీబీఐ దర్యాప్తు చేయించాలి : తేల్చిచెప్పిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విశాఖపట్నం: డీఎస్సీలో ఏ విభాగంలో చూసినా అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా ఇవాళ కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలిపామని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రం సమర్ఫించాక కేకే రాజు, జక్కంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా డీఎస్సీ అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ ను కేబినెట్ నుంచి తప్పించాలని, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని కేకే రాజు, జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో కేకే రాజు, జక్కంపూడి రాజా ఇంకేమన్నారంటే… ● మెగా కాదు దగా డీఎస్సీయే ఇది – కేకే రాజు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన కూటమి ప్రభుత్వంపై, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్ధుల తరఫున వినతిపత్రాలు సమర్పించాం. కరోనా లాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని తపించారు. 2019న మే 31న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోపే అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. లక్షా 30 వేల మంది నిరుద్యోగులకు ఒకేసారి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించారు. కానీ యువగళంలో లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబు .. అధికారంలోకి రాగానే జిల్లాకు లక్ష ఉద్యోగాల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విద్య రంగానికి కూడా అలాగే తూట్లు పొడిచారు. ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి మూడు లక్షల మంది కలల్ని కల్లలు చేశారు. లోకేష్ చేతకానితనం, అసమర్థతతోనే ఈ స్కాం జరిగింది. లోకేష్ దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ● చంద్రబాబు ఖాతాలో మరో మోసం – జక్కంపూడి రాజా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి.. బాబొస్తేనే జాబొస్తుందని, మొట్టమొదటి సంతకం డీఎస్సీపైనే అని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారు. ఆ తర్వాత తనకు అలవాటైన తీరులో హామీలన్నీ అటకెక్కించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్సీ నోటిఫికేషన్ అత్యంత పారదర్శకంగా ఇస్తే, దాన్ని అడ్డగోలుగా రద్దు చేసి ధనార్జనే ధ్యేయంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. విద్యాశాఖకు మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ కు ముఖ్యమంత్రి కొడుకు అన్న అర్హత మాత్రమే ఉంది. అదే ఇప్పుడు రాష్ట్ర యువతకు శాపంగా మారింది. ఏదో విధంగా లోకేష్ ను మంత్రి చేయాలనుకుంటే, ఏదో ఒక అప్రాధాన్య శాఖ ఇస్తే సరిపోయేది. కానీ లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడే అవకాశం ఇచ్చారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే లక్షల మంది ఆక్రందనలు, బాధలు పడుతున్నారు. టీచర్ అవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రయత్నిస్తే తమను మోసం చేసి రోడ్లపైకి లాగారని ఓ మహిళ బాధపడుతున్నారు. రోజుకు 20 గంటల పాటు చదువుకుని, అప్పులు తెచ్చి లక్షలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లి డీఎస్సీ కొట్టాలని భావించిన అభ్యర్ధులు.. ఇప్పుడు జరిగిన అక్రమాలు చూసి నివ్వెరపోతున్నారు. ఈ 3 లక్షల 30 వేల మంది బాధితుల బాధ వర్ణనాతీతంగా ఉంది. – నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే అర్హత లోకేష్ కు ఎక్కడిది ? మీకు ఏ అర్హత ఉందని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని లోకేష్ ను ప్రశ్నిస్తున్నాం. ఇసుక, మైనింగే దోపిడీలే నిరుద్యోగులతో సైతం ఆడుకుంటున్నారు. హెరిటేజ్ పాలు, పెరుగు అమ్మినట్లు 15 లక్షలకు ఎస్జీటీ, 20 లక్షలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రేట్లు పెట్టి అమ్ముకున్నారు. దాని ఆడియో రికార్డింగ్ లీక్ అయినా ఏ ఒక్కరిపై ఇవాళ్టికీ చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి కచ్చితంగా ఇందులో లోకేష్ పాత్ర ఉందని అర్దమవుతోంది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ ఎంతో మంది కేటగిరీల వారీగా మొదటి ర్యాంకులు వచ్చిన వారు తమకు ఉద్యోగాలు రాలేదని బాధపడుతుంటే కనిపించట్లేదా ? స్పోర్ట్స్ కోటాలో తాడాట, బొంగరం ఆటలకు ఉద్యోగాలిచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చాక స్పోర్ట్స్ కోటా ఇచ్చి, రిక్రూట్ మెంట్ పూర్తయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత ఆ జీవోను ఎత్తేశారంటే ఇందులో అక్రమాలు జరిగినట్లే కదా. కాల్ లెటర్లు అందరికీ ఇవ్వం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బేరాలు కుదుర్చుకున్న వారికే పోస్టులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మీలో చిత్తశుద్ది ఉంటే లోకేష్ ను వెంటనే విద్యాశాఖ నుంచి, మంత్రి పదవి నుంచి తప్పించాలి. సీబీఐ విచారణ చేయించాలి లేనిపక్షంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. లేకపోతే ఇందులో లోకేష్ పాత్ర ఉందని అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కేసులు పెట్టి, లోకేష్ ను ఏ1గా చేర్చాలి. ఇవాళ జరిగిన కార్యక్రమం ఆరంభం మాత్రమే. డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఉద్యమాలు తప్పవని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

– ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర స్దాయిలో ఉద్యమం
: వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరిక

డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించిన తర్వాత వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా

– మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేశారు
– అక్రమాలపై కలెక్టర్లరేట్ల వద్ద నిరసన తెలిపాం
– లోకేష్ అసమర్థత వల్లే డీఎస్సీలో అవకతవకలు
: ఆయన రాజీనామా చేసి తీరాల్సిందే
కేకే రాజు డిమాండ్

– అక్రమాల కోసమే డీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు
– స్పోర్ట్స్ కోటా జీవోల్ని మార్చి అర్హుల్ని ముంచారు
– ఏ అర్హతతో లోకేష్ విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారు?
– లోకేష్ ను తప్పించాలి, సీబీఐ దర్యాప్తు చేయించాలి
: తేల్చిచెప్పిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

విశాఖపట్నం:

డీఎస్సీలో ఏ విభాగంలో చూసినా అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా ఇవాళ కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలిపామని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రం సమర్ఫించాక కేకే రాజు, జక్కంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా డీఎస్సీ అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ ను కేబినెట్ నుంచి తప్పించాలని, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని కేకే రాజు, జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.
ప్రెస్ మీట్లో కేకే రాజు, జక్కంపూడి రాజా ఇంకేమన్నారంటే…

● మెగా కాదు దగా డీఎస్సీయే ఇది
– కేకే రాజు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన కూటమి ప్రభుత్వంపై, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్ధుల తరఫున వినతిపత్రాలు సమర్పించాం. కరోనా లాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని తపించారు. 2019న మే 31న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోపే అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. లక్షా 30 వేల మంది నిరుద్యోగులకు ఒకేసారి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించారు. కానీ యువగళంలో లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబు .. అధికారంలోకి రాగానే జిల్లాకు లక్ష ఉద్యోగాల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విద్య రంగానికి కూడా అలాగే తూట్లు పొడిచారు. ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి మూడు లక్షల మంది కలల్ని కల్లలు చేశారు. లోకేష్ చేతకానితనం, అసమర్థతతోనే ఈ స్కాం జరిగింది. లోకేష్ దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.

● చంద్రబాబు ఖాతాలో మరో మోసం
– జక్కంపూడి రాజా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి.. బాబొస్తేనే జాబొస్తుందని, మొట్టమొదటి సంతకం డీఎస్సీపైనే అని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారు. ఆ తర్వాత తనకు అలవాటైన తీరులో హామీలన్నీ అటకెక్కించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్సీ నోటిఫికేషన్ అత్యంత పారదర్శకంగా ఇస్తే, దాన్ని అడ్డగోలుగా రద్దు చేసి ధనార్జనే ధ్యేయంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. విద్యాశాఖకు మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ కు ముఖ్యమంత్రి కొడుకు అన్న అర్హత మాత్రమే ఉంది. అదే ఇప్పుడు రాష్ట్ర యువతకు శాపంగా మారింది. ఏదో విధంగా లోకేష్ ను మంత్రి చేయాలనుకుంటే, ఏదో ఒక అప్రాధాన్య శాఖ ఇస్తే సరిపోయేది. కానీ లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడే అవకాశం ఇచ్చారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే లక్షల మంది ఆక్రందనలు, బాధలు పడుతున్నారు. టీచర్ అవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రయత్నిస్తే తమను మోసం చేసి రోడ్లపైకి లాగారని ఓ మహిళ బాధపడుతున్నారు. రోజుకు 20 గంటల పాటు చదువుకుని, అప్పులు తెచ్చి లక్షలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లి డీఎస్సీ కొట్టాలని భావించిన అభ్యర్ధులు.. ఇప్పుడు జరిగిన అక్రమాలు చూసి నివ్వెరపోతున్నారు. ఈ 3 లక్షల 30 వేల మంది బాధితుల బాధ వర్ణనాతీతంగా ఉంది.

– నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే అర్హత లోకేష్ కు ఎక్కడిది ?

మీకు ఏ అర్హత ఉందని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని లోకేష్ ను ప్రశ్నిస్తున్నాం. ఇసుక, మైనింగే దోపిడీలే నిరుద్యోగులతో సైతం ఆడుకుంటున్నారు. హెరిటేజ్ పాలు, పెరుగు అమ్మినట్లు 15 లక్షలకు ఎస్జీటీ, 20 లక్షలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రేట్లు పెట్టి అమ్ముకున్నారు. దాని ఆడియో రికార్డింగ్ లీక్ అయినా ఏ ఒక్కరిపై ఇవాళ్టికీ చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి కచ్చితంగా ఇందులో లోకేష్ పాత్ర ఉందని అర్దమవుతోంది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ ఎంతో మంది కేటగిరీల వారీగా మొదటి ర్యాంకులు వచ్చిన వారు తమకు ఉద్యోగాలు రాలేదని బాధపడుతుంటే కనిపించట్లేదా ? స్పోర్ట్స్ కోటాలో తాడాట, బొంగరం ఆటలకు ఉద్యోగాలిచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చాక స్పోర్ట్స్ కోటా ఇచ్చి, రిక్రూట్ మెంట్ పూర్తయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత ఆ జీవోను ఎత్తేశారంటే ఇందులో అక్రమాలు జరిగినట్లే కదా. కాల్ లెటర్లు అందరికీ ఇవ్వం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బేరాలు కుదుర్చుకున్న వారికే పోస్టులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మీలో చిత్తశుద్ది ఉంటే లోకేష్ ను వెంటనే విద్యాశాఖ నుంచి, మంత్రి పదవి నుంచి తప్పించాలి. సీబీఐ విచారణ చేయించాలి లేనిపక్షంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. లేకపోతే ఇందులో లోకేష్ పాత్ర ఉందని అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కేసులు పెట్టి, లోకేష్ ను ఏ1గా చేర్చాలి. ఇవాళ జరిగిన కార్యక్రమం ఆరంభం మాత్రమే. డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఉద్యమాలు తప్పవని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.