Thursday, 6 August 2026
  • Home  
  • డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

ఆత్మకూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి): శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండలం మురుగళ్ల గ్రామ ఎస్సీ కాలనీలోని పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా తోడేటి అశోక్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీలత, అంగన్‌వాడీ టీచర్ మల్లేశ్వరి, స్కూల్ చైర్మన్ తోడేటి కామాక్షి, గ్రామస్తులు ఆదినారాయణ, కృపారావు, సుమంత్, రాజేష్, బద్రి, సిసింద్రీ, తరుణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.