ఒంటిమిట్ట: మండలంలోని కోనరాజుపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపల్లి గ్రామంలో గణేష్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ గేమ్స్ నిర్వహించడంతో పాటు గ్రామంలోని రైతులు, ప్రజలకు భోజన వసతి ఏర్పాటు చేశారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ పాటలో గోపినేని పాలేశ్వరయ్య రూ.70,000లకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే డబ్బులు మాలలో దాసరి బుజ్జమ్మ రూ.7,550లకు పాట పాడారు. చెరుకు పాటలో చెవుల కృష్ణయ్య రూ.3,500లకు పాట పాడారు.
ఈ కార్యక్రమానికి విగ్రహ దాత గోపినేని రాధాకృష్ణతో పాటు గణేష్ కమిటీ సభ్యులు గోపినేని పాలకొండయ్య, దాసరి రవి, గోపినేని ఏవి, గోపినేని అర్జున్, గోపినేని ఈశ్వర్, గోపినేని సంతయ్య తదితరులు ఆధ్వర్యం వహించారు. గ్రామస్థులు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


