Friday, 11 July 2025
  • Home  
  • టీవీ, సెల్ ఫోన్ ల వాడకం — తెచ్చి పెడుతుంది ఊబకాయం.
- Featured - హెల్త్ టిప్స్

టీవీ, సెల్ ఫోన్ ల వాడకం — తెచ్చి పెడుతుంది ఊబకాయం.

సమాజములో ఈ మధ్యకాలంలో బిపి. షుగర్‌ .ఊబకాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . గతంలో ధనికులలో ఎక్కువగా ఉండే ఊబకాయం ప్రస్తుతం పేద వారిలో కూడా కనిపిస్తుంది.గతంలో పెద్దవయసు వారిలోనే ఉండేది. ఇప్పుడు చంటి పిల్లల్లో కూడా వస్తుంది.దీనికి ప్రధాన కారణం ”పని తక్కువ – తిండి ఎక్కువ”. దీని నివారణకు తిండి తగ్గించుకోవడం ఒక భాగమైతే .శరీరానికి వ్యాయాయం కల్పించడం రెండవ భాగం. తిండి తగ్గించుకోవాలని, పని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆచరణలో చేయరు. ఇది చేయాలంటే కావలసింది గట్టి పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పిల్లలలో ఊబకాయం గురించి ” ప్రపంచ ఊబకాయ దినోత్సవం” సందర్భంగా ఈరోజు (11-10-19) కొన్ని విషయాలు చర్చించుకుందాం. పిల్లలు ముద్దుగా, బొద్దుగా బొజ్జలేసుకుని మన కళ్ళముందు తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉన్నారని సంబర పడతాము .కానీ ఈ బొజ్జ కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, బిపి, షుగర్‌ లాంటి జబ్బులు భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని మర్చిపోతాం. బొజ్జలు వచ్చిన తరువాత తగ్గించుకోవడం కష్టం . బొజ్జ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. పసిపిల్లలకు బొజ్జ రాకుండా ఏమి చేద్దాం? పసికందుకు తప్పక తల్లిపాలు తాగించాలి. బిడ్డకి కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు తాగించాలి. సంవత్సరం రోజులు తల్లి పాలు తాగిస్తే మరీ మంచిది . అలా తాగిస్తే పాలు ఇచ్చిన తల్లికి, పాలు తాగిన బిడ్డకి అందరికీ ఉపయోగమే. తల్లి పాలు తాగిన వారికి ఊబకాయం వచ్చే అవకాశం చాలా తక్కువ.  పండ్లు తినాలి-తినిపించాలి.  అప్పుడప్పుడు పండ్లు తినడం కాదు. ప్రతి రోజూ తినాలి . ఒకే రకం కాదు, రక రకాల వివిధ రంగుల పండ్లు తినాలి. రోజుకు నాలుగైదు విడతలుగా తినాలి. ఇలా పండ్లు పిల్లలకు కూడా తినిపించ గలిగితే ఊబకాయం,షుగర్ ,బిపిలు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది. పండ్లు తినడాన్ని చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. కుటుంబమంతా కలిసి పండ్లు తినడం అలవాటుగా పెట్టుకోవడం మంచిది. అప్పుడే పిల్లలు ఆచరించే ప్రయత్నం చేస్తారు.  ప్రతి రోజు తప్పక వ్యాయామం చేయాలి. పరిగెత్తడం,నడవడం,ఆడుకోవడం లాంటివి ఏవైనా కావచ్చు శరీరం బాగా కదిలే రకంగా రోజుకు ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాలు చేయగల్గితే ఊబకాయం మనచెంతకు చేరలేదు .ఈ వ్యాయామ కార్యక్రమాన్ని పెద్దలు ఆచరిస్తూ,దగ్గరుండి పిల్లలకు అలవాటు చేయాలి.అప్పుడే పిల్లలు దానిని వారి జీవితంలో ఒక భాగం గా గుర్తించి ఆచరించే ప్రయత్నం చేస్తారు.  వీడియో గేములను చూడడం తగ్గించు కోవాలి. టీవీలు ,సెల్ ఫోన్లు చూడడం చిన్నపిల్లల్లో ఇటీవల చాలా ఎక్కువైంది.పిల్లల గోల తప్పించుకోవడానికి తల్లిదండ్రులకు సెల్ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది . సెల్ ఫోను, లాప్ టాప్ ,టీవీ లను చూడడానికి మనం కేటాయించే సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటాం. ఈ స్క్రీన్ టైం గంటకు లోబడి ఉంటే ఇబ్బందులు ఏమీ లేవు .రోజుకు రెండు గంటలకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .ఈ సమస్యలు చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. కంటిమీద భారమై చూపులో దోషం వస్తుంది. ఆడుకోవడానికి సమయం లేక ఊబకాయం వస్తుంది. వీడియో చూస్తూ తిండి తింటున్నప్పుడు ఎంత తిన్నామో సరిగ్గా తెలియక ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది.వీడియోలు చూస్తూ నిద్ర సరిగా లేక అనేక అనారోగ్యాలకు గురవుతారు.  కూల్ డ్రింక్స్ ను, జంక్ ఫుడ్స్ ను వీలైనంత తగ్గించు కోవాలి  ఇవి తినడానికి, తాగడానికి రుచిగా ఉండవచ్చు . కానీ ఆరోగ్యానికి ఏ రూపంలోనూ ఉపయోగం లేదు.చిన్న కూల్ డ్రింక్ బాటిల్ లో దాదాపుగా ఎనిమిది నుంచి పది స్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ లు చెడిపోకుండా ఉండడానికి అందులో అనేక రకాల రసాయనాలు కలుపుతారు. వీటన్నిటి వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటే వారికి ఊబకాయం రావడం ఖాయం.                  గతంలో                                                                                                                                                ప్రస్తుతం                                                                                                                                                                                                డాక్టర్‌ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌), డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

సమాజములో ఈ మధ్యకాలంలో బిపి. షుగర్‌ .ఊబకాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . గతంలో ధనికులలో ఎక్కువగా ఉండే ఊబకాయం ప్రస్తుతం పేద వారిలో కూడా కనిపిస్తుంది.గతంలో పెద్దవయసు వారిలోనే ఉండేది. ఇప్పుడు చంటి పిల్లల్లో కూడా వస్తుంది.దీనికి ప్రధాన కారణం ”పని తక్కువ – తిండి ఎక్కువ”. దీని నివారణకు తిండి తగ్గించుకోవడం ఒక భాగమైతే .శరీరానికి వ్యాయాయం కల్పించడం రెండవ భాగం. తిండి తగ్గించుకోవాలని, పని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆచరణలో చేయరు. ఇది చేయాలంటే కావలసింది గట్టి పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పిల్లలలో ఊబకాయం గురించి ” ప్రపంచ ఊబకాయ దినోత్సవం” సందర్భంగా ఈరోజు (11-10-19) కొన్ని విషయాలు చర్చించుకుందాం.
పిల్లలు ముద్దుగా, బొద్దుగా బొజ్జలేసుకుని మన కళ్ళముందు తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉన్నారని సంబర పడతాము .కానీ ఈ బొజ్జ కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, బిపి, షుగర్‌ లాంటి జబ్బులు భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని మర్చిపోతాం. బొజ్జలు వచ్చిన తరువాత తగ్గించుకోవడం కష్టం . బొజ్జ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

పసిపిల్లలకు బొజ్జ రాకుండా ఏమి చేద్దాం?
పసికందుకు తప్పక తల్లిపాలు తాగించాలి.
బిడ్డకి కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు తాగించాలి. సంవత్సరం రోజులు తల్లి పాలు తాగిస్తే మరీ మంచిది . అలా తాగిస్తే పాలు ఇచ్చిన తల్లికి, పాలు తాగిన బిడ్డకి అందరికీ ఉపయోగమే. తల్లి పాలు తాగిన వారికి ఊబకాయం వచ్చే అవకాశం చాలా తక్కువ.
పండ్లు తినాలి-తినిపించాలి

అప్పుడప్పుడు పండ్లు తినడం కాదు. ప్రతి రోజూ తినాలి . ఒకే రకం కాదు, రక రకాల వివిధ రంగుల పండ్లు తినాలి. రోజుకు నాలుగైదు విడతలుగా తినాలి. ఇలా పండ్లు పిల్లలకు కూడా తినిపించ గలిగితే ఊబకాయం,షుగర్ ,బిపిలు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది. పండ్లు తినడాన్ని చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. కుటుంబమంతా కలిసి పండ్లు తినడం అలవాటుగా పెట్టుకోవడం మంచిది. అప్పుడే పిల్లలు ఆచరించే ప్రయత్నం చేస్తారు.

ప్రతి రోజు తప్పక వ్యాయామం చేయాలి.
పరిగెత్తడం,నడవడం,ఆడుకోవడం లాంటివి ఏవైనా కావచ్చు శరీరం బాగా కదిలే రకంగా రోజుకు ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాలు చేయగల్గితే ఊబకాయం మనచెంతకు చేరలేదు .ఈ వ్యాయామ కార్యక్రమాన్ని పెద్దలు ఆచరిస్తూ,దగ్గరుండి పిల్లలకు అలవాటు చేయాలి.అప్పుడే పిల్లలు దానిని వారి జీవితంలో ఒక భాగం గా గుర్తించి ఆచరించే ప్రయత్నం చేస్తారు.
వీడియో గేములను చూడడం తగ్గించు కోవాలి.
టీవీలు ,సెల్ ఫోన్లు చూడడం చిన్నపిల్లల్లో ఇటీవల చాలా ఎక్కువైంది.పిల్లల గోల తప్పించుకోవడానికి తల్లిదండ్రులకు సెల్ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది . సెల్ ఫోను, లాప్ టాప్ ,టీవీ లను చూడడానికి మనం కేటాయించే సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటాం. ఈ స్క్రీన్ టైం గంటకు లోబడి ఉంటే ఇబ్బందులు ఏమీ లేవు .రోజుకు రెండు గంటలకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .ఈ సమస్యలు చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. కంటిమీద భారమై చూపులో దోషం వస్తుంది. ఆడుకోవడానికి సమయం లేక ఊబకాయం వస్తుంది. వీడియో చూస్తూ తిండి తింటున్నప్పుడు ఎంత తిన్నామో సరిగ్గా తెలియక ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది.వీడియోలు చూస్తూ నిద్ర సరిగా లేక అనేక అనారోగ్యాలకు గురవుతారు.
కూల్ డ్రింక్స్ ను, జంక్ ఫుడ్స్ ను వీలైనంత తగ్గించు కోవాలి 
ఇవి తినడానికి, తాగడానికి రుచిగా ఉండవచ్చు . కానీ ఆరోగ్యానికి ఏ రూపంలోనూ ఉపయోగం లేదు.చిన్న కూల్ డ్రింక్ బాటిల్ లో దాదాపుగా ఎనిమిది నుంచి పది స్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ లు చెడిపోకుండా ఉండడానికి అందులో అనేక రకాల రసాయనాలు కలుపుతారు. వీటన్నిటి వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటే వారికి ఊబకాయం రావడం ఖాయం.
                 గతంలో                                                                                         
               

 

                                    ప్రస్తుతం 
                                                                                                                                                                                             
డాక్టర్‌ యం.వి.రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌),
డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి,
నెల్లూరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.