అరకులోయ మండలం బస్కి పంచాయతీ, గాయిబంధ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారన్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ గొల్లూరి మొద్దు స్పష్టం చేశారు. బుధవారం వేరే పని నిమిత్తం టీడీపీ ఇంచార్జ్ డా.సియ్యారి దొన్ను దొర క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, తమను పిలిచి బలవంతంగా పసుపు కండువాలు కప్పి ఫోటోలు తీసి ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని, కండువా వద్దని చెప్పినా వినలేదని తెలిపారు. వైసీపీలో తమకు సముచిత గౌరవం లభించిందని, జగన్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావుతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Uploaded Video:


