ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం జీఓ నెం. 291 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు కపుల్ కేటగిరీలో 134 మంది ఉపాధ్యాయులు, పరస్పర అవగాహన (మ్యూచువల్ ట్రాన్స్ఫర్) ఆధారంగా 248 మందిని బదిలీ చేస్తూ లిస్ట్‌ను విడుదల చేశారు.
ఇక గ్రేడ్-2 భాషా పండితుల పదోన్నతులకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని దీర్ఘకాలంగా కోరుతూ ఆందోళన చేసిన వారికి ఇది ఊరట కలిగించే పరిణామంగా మారింది.


