కామారెడ్డి, 18జూన్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లాలో మీడియా ప్రతినిధుల అధికారిక గుర్తింపు కార్డుల మంజూరు ప్రక్రియ తీవ్ర చర్చ నీయాంశమైంది. జిల్లా గుర్తింపు కార్డుల పరిశీలన కమిటీ సూచనలను, కలెక్టర్ ఆదేశాలను సైతం పక్కనబెట్టి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన చిన్న పత్రికల విలేకరులకు కార్డులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని, దీనికి నిరసనగా ధర్నాల కు సిద్ధం కావాలని తెలంగాణ విలేకరుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్ పిలుపునిచ్చారు.అంకెల్లో గుర్తింపు కార్డుల గందరగోళం: జిల్లా వ్యాప్తంగా మొత్తం 548 మంది విలేకరులు గుర్తిం పు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది.ఆమోదం పొందిన కార్డులు: 273 పరిశీలనలో ఉన్నవి: 85 కంపెనీల రిజిస్ట్రేషన్ పరిశీలనకు ముందున్న దశలో ఉన్నవి 38కమిటీకి తెలియకుండా తిరస్కరించినవి: 156
విలేకరుల ప్రధాన అభ్యంతరాలు – ఆరోపణలు:కార్డులు ముద్రించినా పంపిణీ చేయకపోవడం:కమిటీ ఆమోదించి, ఇప్పటికే ముద్రితమైన 273 గుర్తింపు కార్డుల్లో.. చిన్న పత్రికలకు చెందిన విలేకరుల కార్డులను ఇప్పటికీ అందజేయకుండా సమాచార అధికారి కావాలనే ఆలస్యం చేస్తున్నార ని కమిటీ సభ్యులు మండిపడుతున్నారు.కమిటీకి తెలియకుండా 156 దరఖాస్తుల తిరస్కరణ. గుర్తింపు కార్డుల కమిటీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఏకంగా 156 దరఖా స్తులను తిరస్కరించారు. దీనివల్ల అర్హులైన విలేకరులు మళ్లీ మొదటి నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం ఆమోదించిన, తిరస్కరించిన, పరిశీలనలో ఉన్న దరఖాస్తుల జాబితాలను కూడా కమిటీకి ఇవ్వడానికి సమాచార అధికారి నిరాకరిస్తుండడం గమనార్హం.చిన్న పత్రికలపై వివక్ష – నిబంధనల ఉల్లంఘన.సమాచార పౌర సంబంధాల శాఖలో నమోదైన చిన్న పత్రికల ప్రతినిధులను తీవ్రంగా చిన్నచూపు చూస్తున్నారని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. యాజమాన్య ధృవీకరణ పత్రం లేకపోయినా కొందరికి అనుకూలంగా కార్డులు మంజూరు చేశారని, అదే సమయంలో కార్యాలయాల్లో పనిచేసే విలేకరులు, స్వేచ్ఛా అనువాదకులు, సీనియర్ అనుభవజ్ఞులైన విలేకరులకు కార్డులు ఇవ్వడానికి మాత్రం సుముఖత చూపడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకూ బేఖాతరు!అర్హులైన విలేకరులందరికీ కార్డులు ఇవ్వాలి, కమిటీ సిఫార్సులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి” అని జిల్లా కమిటీ చైర్మన్/కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ, సమాచార అధికారి వాటిని లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. నేనే కార్డులు ఇవ్వాలి, వారు ఇస్తారా?” అంటూ సదరు అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఆయన ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోంది. ఆందోళనకు పిలుపు..జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వ్యవహరి స్తున్న తీరుపై కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న విలేకరుల లోకం తీవ్ర అసంతృప్తితో ఉంది. అర్హులై న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు అందే వరకు, నిబంధనల ప్రకారం కమిటీ నిర్ణయాలను అమలు చేసే వరకు సంఘం తరఫున రాజీలేని పోరాటం చేస్తామని జిల్లా విలేకరుల సంఘం స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


