రాజన్న సిరిసిల్ల ఆగస్టు 5 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్‌లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ, జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగును పాకిస్తాన్‌తో పోల్చడం త్రివర్ణ పతాకాన్ని అవమానించడమేనని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా, మండల అధ్యక్షులపై అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విమర్శలు కాకుండా అభివృద్ధిపై మాట్లాడాలని బీజేపీ నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


