Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

జాతీయ అవార్డు పొందిన కేతరాజు నరేంద్రకు అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా, ధనలక్ష్మీపురంలో ఉన్న వీ.బి.ఆర్ పాఠశాలలో హిందీ పండిట్‌గా సేవలందిస్తున్న శ్రీ కేతరాజు నరేంద్ర కు గౌరవనీయమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది.
  • గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఈరోజు, తేదీ: 13-04-2025 న నరేంద్ర గారికి అందజేశారు.
  • హిందీ భాషాభివృద్ధి, విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించటం గర్వకారణం.

నెల్లూరు జిల్లా, ధనలక్ష్మీపురంలో ఉన్న వీ.బి.ఆర్ పాఠశాలలో హిందీ పండిట్‌గా సేవలందిస్తున్న శ్రీ కేతరాజు నరేంద్ర కు గౌరవనీయమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఈరోజు, తేదీ: 13-04-2025 న నరేంద్ర గారికి అందజేశారు.

హిందీ భాషాభివృద్ధి, విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించటం గర్వకారణం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, హిందీ భాషపై వారి ఆసక్తిని పెంపొందించడంలో కేతరాజు నరేంద్ర గారి పాత్ర ప్రశంసనీయం.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీ.బి.ఆర్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, తోటి ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు నరేంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నరేంద్ర గారు మరిన్ని పురస్కారాలు అందాలని వారు ఆకాంక్షించారు.

ఈ అవార్డు విద్యారంగానికి, హిందీ భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి నిదర్శనం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *