జాప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా..
మళ్లీ పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఎన్నిక
*విజయవాడ: అనంతపురం ఫిబ్రవరి 21
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా మళ్లీ తిరిగి పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ని జాప్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాడు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించి ఉపాధ్యక్ష పదవిని లభించేలా చొరవ చూపిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పున్నమరాజు, యుగందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేయడమే గాకుండా ఈ విషయంలో అర్హులయిన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేందుకు పోరాడుతానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సమస్యలే మా ఊపిరి : జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త పల్లి అనిల్ కుమార్ రెడ్డి
జాప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా.. మళ్లీ పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఎన్నిక *విజయవాడ: అనంతపురం ఫిబ్రవరి 21 జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా మళ్లీ తిరిగి పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ని జాప్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాడు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించి ఉపాధ్యక్ష పదవిని లభించేలా చొరవ చూపిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పున్నమరాజు, యుగందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేయడమే గాకుండా ఈ విషయంలో అర్హులయిన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేందుకు పోరాడుతానని హామీ ఇచ్చారు.