Thursday, 13 August 2026
  • Home  
  • జగన్ పర్యటనకు ములాఖాత్‌కే అనుమతి.. ర్యాలీలు, సభలకు అనుమతి లేదు
- నంద్యాల

జగన్ పర్యటనకు ములాఖాత్‌కే అనుమతి.. ర్యాలీలు, సభలకు అనుమతి లేదు

నంద్యాల, ఆగస్టు 12: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13న కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసుల అనుమతులపై జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ స్పష్టత ఇచ్చారు. జైలులో ఉన్న వ్యక్తిని ములాఖాత్ ద్వారా పరామర్శించి తిరిగి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా జైలుకు వెళ్లేందుకు పోలీసు భద్రత కల్పిస్తామని తెలిపారు. అనుమతి లేని బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.