Thursday, 24 September 2026
  • Home  
  • జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు
- రంగారెడ్డి

జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు

జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు బ్రేకింగ్ న్యూస్ | హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులాల పేరుతో దూషణల ఆరోపణలు.. క్రమశిక్షణ కమిటీ చర్యలు.. ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో కలకలం!

జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు

బ్రేకింగ్ న్యూస్ | హైదరాబాద్

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ పరిణామం ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కులాల పేరుతో దూషణల ఆరోపణలు..
క్రమశిక్షణ కమిటీ చర్యలు..
ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో కలకలం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.