Friday, 31 July 2026
  • Home  
  • చెక్‌డ్యాముల జలకళతో రైతుల్లో ఆనందం
- నిజామాబాద్

చెక్‌డ్యాముల జలకళతో రైతుల్లో ఆనందం

గత మూడు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు పూర్తిగా నిండిపోయి, చెక్‌డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ప్రవహిస్తున్న నీటి అందాలు స్థానికులతో పాటు పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ వర్షాలతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరగడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత మెరుగుపడి పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని, ఈ సీజన్‌లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు ప్రకృతికి పునర్జీవం పోసి వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయని స్థానికులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.