ముస్తాబాద్ మే 15 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు సర్పంచ్ మా చిట్టి లక్ష్మణ్, ఉప సర్పంచ్ గాడిచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టి.బి ముక్త భారత్ అభియాన్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ హఫీజ్, టి.బి సూపర్వైజర్ మైపాల్, హెచ్.ఎస్. లక్ష్మీ ప్రసాద్, ఎం.హెచ్.హెచ్.పి.కె ఉదయ్, సి.హెచ్. రజిత, ఆశా వర్కర్లు లక్ష్మి, సరళ, జ్యోతి పాల్గొన్నారు.
అలాగే బీసీ సాధికారక మండల అధ్యక్షుడు సుద్దాల దేవయ్యతో పాటు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


