Sunday, 13 September 2026
  • Home  
  • చిట్వేల్ : తుమ్మకొండలో పోలీసుల రాత్రి బస
- తిరుపతి

చిట్వేల్ : తుమ్మకొండలో పోలీసుల రాత్రి బస

చిట్వేల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సున్నిత గ్రామం తుమ్మకొండలో పోలీసులు రాత్రి బస నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులతో సమావేశమై ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. అనంతరం సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మోసపోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు. గ్రామంలో గంజాయి వినియోగం, విక్రయాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేసి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని సూచించారు.

చిట్వేల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సున్నిత గ్రామం తుమ్మకొండలో పోలీసులు రాత్రి బస నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులతో సమావేశమై ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు.
అనంతరం సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మోసపోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు. గ్రామంలో గంజాయి వినియోగం, విక్రయాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేసి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.