Sunday, 16 August 2026
  • Home  
  • *చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* *ముఖ్యఅతిథిగా హాజరైన వాకాడు సీఐ*
- తిరుపతి

*చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* *ముఖ్యఅతిథిగా హాజరైన వాకాడు సీఐ*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,* చిట్టమూరు పోలీస్ స్టేషన్‌ ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి జనగణమన ఆలపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత చక్కగా చదువుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం చిట్టమూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,*

చిట్టమూరు పోలీస్ స్టేషన్‌ ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి జనగణమన ఆలపించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత చక్కగా చదువుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం చిట్టమూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.