ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆత్మకూరులోని చికెన్ దుకాణాల నిర్వాహకులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి జాతీయ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంఘీభావం తెలిపారు.ఏడాదిలో రెండు రోజులు దుకాణాలను మూసివేయడం వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదని, దేశానికి సంబంధించిన జాతీయ పండుగలను సంతోషంగా జరుపుకోవడమే తమకు ముఖ్యమని చికెన్ షాపుల నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని భాయ్ చికెన్ షాప్ వద్ద షాపు నిర్వాహకులు జమీర్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం ప్రజలకు చాక్లెట్లు పంపిణీ చేసి, ప్రతి ఒక్కరికీ జాతీయ జెండాలను ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో సోదరభావంతో మెలిగుతూ, కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చికెన్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి వేడుకల్లో పాల్గొనడం పట్ల పలువురు అభినందించారు.

చికెన్ షాపులు మూసివేసి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న నిర్వాహకులు