ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): 2025–26 సంవత్సరంలో ఉత్తమ సేవలు అందించినందుకు SRED సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఎన్జీవో వాగాల శ్రీహరికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు లభించింది. నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.వనమహోత్సవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వాగాల శ్రీహరి వివిధ గ్రామాల్లో సుమారు 5 వేల మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన సేవలను గుర్తించిన అధికారులు ఉత్తమ సేవా అవార్డుకు ఎంపిక చేశారు.సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న వాగాల శ్రీహరికి ఈ అవార్డు లభించడం పట్ల SRED సేవా సంస్థ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు.

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న వాగాల శ్రీహరి