Friday, 2 October 2026
  • Home  
  • *చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్‌కు ఘన వీడ్కోలు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్‌కు ఘన వీడ్కోలు*

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): చింతూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న శుభం నొక్వల్‌కు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో నూతనంగా చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.నరేంద్ర పడాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, చింతూరు సబ్ డివిజన్‌లో శుభం నొక్వల్ సమర్థవంతంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు.ముఖ్యంగా పునరావాసం, పునరావాస ప్యాకేజీల అమలులో భాగంగా 10,881 మంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాలు అందించడంలో, అలాగే సుమారు 6,000 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో చూపిన చొరవ అభినందనీయమన్నారు. నూతన బాధ్యతల్లో కూడా శుభం నొక్వల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శుభం నొక్వల్ మాట్లాడుతూ, చింతూరు ప్రాంతంలో విధులు నిర్వహించిన కాలం తనకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించిందన్నారు. అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధులు,స్థానిక ప్రజల సహకారంతో పునరావాసం, భూసేకరణ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. తనకు సహకరించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు శుభం నొక్వల్‌ను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. నూతన సబ్ కలెక్టర్ సీహెచ్. నరేంద్ర పడాల్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
చింతూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న శుభం నొక్వల్‌కు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో నూతనంగా చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.నరేంద్ర పడాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, చింతూరు సబ్ డివిజన్‌లో శుభం నొక్వల్ సమర్థవంతంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు.ముఖ్యంగా పునరావాసం, పునరావాస ప్యాకేజీల అమలులో భాగంగా 10,881 మంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాలు అందించడంలో, అలాగే సుమారు 6,000 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో చూపిన చొరవ అభినందనీయమన్నారు. నూతన బాధ్యతల్లో కూడా శుభం నొక్వల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
శుభం నొక్వల్ మాట్లాడుతూ, చింతూరు ప్రాంతంలో విధులు నిర్వహించిన కాలం తనకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించిందన్నారు. అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధులు,స్థానిక ప్రజల సహకారంతో పునరావాసం, భూసేకరణ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. తనకు సహకరించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు శుభం నొక్వల్‌ను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. నూతన సబ్ కలెక్టర్ సీహెచ్. నరేంద్ర పడాల్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.