జాతీయ బి.సి. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 27, 28 తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద “చలో ఢిల్లీ” మహా ధర్నా నిర్వహించనున్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం ఈ ఆందోళన చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస యాదవ్, రావులపల్లి వెంకట జ్యోతి, నక్కల నాగరాజు, పిట్టీ భార్గవి, ఉక్క వెంకట శేషయ్య, వెంకటేశ్వర్లు, రాజగోపాల్ సింగ్, మధుసూదన యాదవ్ తదితరులు పాల్గొంటారు. ప్రతినిధుల కోసం బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, పాక సత్యనారాయణ గౌడ్ భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.


