పట్టపగలే వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
సెప్టెంబర్ 4
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల , దేవరపల్లి మండలం సంగాయగూడెం గ్రామంలో విధ్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టపగలే వీధి దీపాలు కాంతులతో విరజిమ్ముతున్నాయి అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులకి కూడా పట్టపగలే దారి చూపిస్తున్నాయి వారికీ కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి గ్రామప్రజలకి కూడా చూడముచ్చటగా వుంది అంటున్న ప్రజలు ఈవిధంగా విధ్యుత్ అధికారులు నిరూపయోగంగా కరంటుని వృధా పరుస్తున్నారు అంటే రోజుకి ఎంత వాడుతున్నారు అనేది వారికే ఎరుక అంటున్న ప్రజలు ఇలా కరెంటు వాడి ఆపై గృహాలు మీద పడి అధిక మతాధిలో బిల్లులు వసూలు చేస్తున్న విద్యుత్తు అధికారులు కనీసము వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు . విద్యుత్ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యం ఆంధ్ర రాష్ట్రానికే పెద్ద మచ్చగా మారిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కనీసం స్థంబాలకి మీటర్లు కూడలేని పరిస్థితి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి


