చలివేంద్రం ప్రారంభించిన ఏపీఎన్‌జీజీఓఎస్ అసోసియేషన్ నేతలు
నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి):
ఏపీ ఎన్‌జీ జీఓఎస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో బుధవారం నాడు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎండలు తీవ్రతరంగా ఉండటంతో ప్రజలకు మజ్జిగ, మంచినీరు వంటి త్రాగునీటి అవసరాలు పెరిగాయని, దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న వేళ వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరంగా బయటకు రావాల్సిన పరిస్థితుల్లో శరీరాన్ని కప్పే బట్టలు ధరించి రావాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షులు ఆంజనేయవర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెంచలయ్య, కోశాధికారి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ల్యాబ్ టెక్నీషియన్ అధ్యక్షులు రఘుబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కరుణమ్మ, కిరణ్, సంయుక్త కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్, విజయకుమార్, కృష్ణకుమార్, చైర్‌పర్సన్ చిన్నమ్మ, నవోదయ, నగర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, సురేష్, స్వర్ణలత, షంషుద్దీన్, మధు, చెంచయ్య, మురళి, రమేశ్ బాబు, జానకి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.