Friday, 17 July 2026
  • Home  
  • గ్రూప్ 2 (ప్రిలిమినరీ ) పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం గురజాడ అప్పారావు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతి శ్రీ
- విజయనగరం 

గ్రూప్ 2 (ప్రిలిమినరీ ) పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం గురజాడ అప్పారావు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతి శ్రీ

గ్రూప్–2 (ప్రిలిమినరీ) పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం* గురజాడ అప్పారావు ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతిశ్రీ విజయనగరం జిల్లా బ్యూరో/రమణ, జూలై 17.( పున్నమి ప్రతినిధి ) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్–2 (ప్రిలిమినరీ) పరీక్షకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 25-07-2026 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంపికైన 100 మంది అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, 10వ తరగతి, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు దరఖాస్తుతో జతచేసి సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని గురజాడ ఆమె తెలిపారు.

గ్రూప్–2 (ప్రిలిమినరీ) పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం*
గురజాడ అప్పారావు ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతిశ్రీ

విజయనగరం జిల్లా బ్యూరో/రమణ, జూలై 17.( పున్నమి ప్రతినిధి )

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్–2 (ప్రిలిమినరీ) పరీక్షకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ జె. జ్యోతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు ఈ నెల 25-07-2026 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంపికైన 100 మంది అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, 10వ తరగతి, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు దరఖాస్తుతో జతచేసి సమర్పించాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని గురజాడ ఆమె తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.