బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర క్షేత్రంలో వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆయన సతీమణి సుమేఘ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.



