ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2016ను కఠినంగా అమలు చేస్తున్నట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ తెలిపారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు, థర్మోకోల్ వస్తువులు, ప్లాస్టిక్ ర్యాపర్ల వినియోగం, విక్రయం, నిల్వ నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వీధి వ్యాపారులకు మొదటిసారి ₹2,500, రెండోసారి ₹5,000 జరిమానా విధిస్తారు. షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లకు మొదటిసారి ₹20,000, రెండోసారి ₹40,000 జరిమానా విధించడంతో పాటు పునరావృతమైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దుకాణాలను సీల్ చేస్తారు. ప్రజలు బయోడిగ్రేడబుల్, కాగితం లేదా గుడ్డ సంచులు ఉపయోగించాలని కమిషనర్ కోరారు.

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు